News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్‌ నగర్​ లో కాంగ్రెస్ గెలవడం ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం

ponnam prabhakar fire on kcr

హైదరాబాద్ : హుజూర్‌ నగర్​ లో కాంగ్రెస్ గెలవడం ప్రజలకు ఎంతో అవసరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీ నేతలకు అహంకారం మరింత పెరుగుతుందన్నారు. హుజూర్​ నగర్ ఎన్నిక అంటే ప్రభుత్వం భయపడుతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఉపఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపించాలని పొన్నం పిలుపునిచ్చారు. సర్పంచ్‌ ల సంఘం అధ్యక్షుడు భూమయ్యను అరెస్టు చేస్తే హోంమంత్రికి తెలియదని అనడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.

- Advertisement -

మిడ్‌ మానేరు కట్టకు ప్రమాదం ఉందో లేదో.. ప్రభుత్వం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. లోయర్‌ మానేరు 24టీఎంసీల సామర్థ్యం కాగా 16టీఎంసీలు మాత్రమే ఉంచుతున్నారని .. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పొన్నం స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.