News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్ నగర్ లో ఉత్తమ్ ఎన్నికల ప్రచారం

సూర్యాపేట : హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్ తో పాటు .. సీనియర్ నేత జానారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

Uttam

జానా రెడ్డితో కలిసి ఉత్తమ్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆంధ్రాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి పని కాంగ్రెస్ హయాంలో జరిగిందేనన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ కి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

Uttam

Tags: HIZURNAGAR BYPOLL, UTTAM KUMAR REDDY,KCR, HIZURNAGAR ELECTION CAMPAIGN, REVANTH REDDY,UTTAM PADMAVATHI,SAIDIREDDY

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.