News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

7న తెల్లవారుజామున చంద్రుడిపైకి

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం సక్సేస్ అయ్యింది. చంద్రయాన్-2 44రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నోసవాళ్లను దాటుకుంటూ దూసుకెళ్తూ.. చంద్రుడికి మరింత దగ్గరైంది. చంద్రుని ఐదో కక్ష్యలో ప్రయానిస్తున్న చంద్రయాన్‌ కాంపోజిట్‌ మాడ్యూల్‌ నుంచి ఆర్బిటర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సోమవారం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరువాత మంగళవారం ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ఆర్బిటర్‌ తిరిగే కక్ష్యనుంచి చంద్రునికి చేరువయ్యేలా ల్యాండర్‌ కక్ష్యను తగ్గించినట్టు ఇస్టో స్పష్టం చేసింది.

chandrayan2
అతి కీలకమైన ఈ కార్యక్రమాన్ని కేవలం 4 సెకన్లలోనే ముగించడంతో విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి 104 కిలోమీటర్ల దగ్గరగా, 128 కిలోమీటర్ల దూరంగా ఉండే చంద్ర సమీప కక్ష్యలో పరిబ్రమిస్తోంది. ఐతే మరోవైపు ఆర్బిటర్‌ మాత్రం ప్రస్తుత కక్ష్యలోనే తిరుగుతున్నట్టు తెలియజేసింది. ఇక బుధవారం ఉదయం 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల  మధ్య మరోసారి కక్ష్య తగ్గింపుప్రక్రియ చేపట్టింది. ల్యాండర్‌ను చందమామకు 36 కిలోమీటర్ల దగ్గరగా 96 కిలోమీటర్ల దూరంగా ఉండే అతి సమీప కక్ష్యలోకి చేర్చే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కక్ష్యలో సంచరించే విక్రమ్‌ ల్యాండర్‌ను 7వ తేదీ తెల్లవారుజామున 1 గంటా 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించే ప్రక్రియను నిర్వహిస్తారు. ల్యాండర్ చంద్రుడిపై దిగిన తరువాత సుమారు నాలుగు గంటల తరువాత రోవర్ దానిలోంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 500 మీటర్ల పరిధిలో రోవర్ పరిశోధనలు చేసి.. సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తుంది.
chandrayan2

- Advertisement -

Tags: chandrayan2, chandrayan2 near to moon, chandrayan2 closest to moon, chandrayan2 landed on moon, chandrayan2 landed at moon

Leave A Reply

Your email address will not be published.