మా.. ఎంపీ కనబడుటలేదు..
- ప్లీజ్ ..మా ఎంపీనీ వెతికపెట్టండి అంటున్న ఓటర్లు..
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా?. ఇండోర్లో జిలేబీ తింటుండగా అతన్ని చివరిసారి చూశాం. ఆ వ్యక్తి కోసం ఢిల్లీ మొత్తం వెతుకుతోంది. ప్రస్తుతం దేశ రాజదాని డిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఇంతకు జిలేబీ తీన్న వ్యక్తిపై పోస్టర్లా అని ఆశ్యర్యపోకండి… అయన మామూలు వ్యక్తికాదు. ఎంపీ కావడమే ఇప్పడు హాట్ టాపిక్ కు కారణమైంది. ఇప్పుడు ఈ పోస్టర్లు కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో.. తెగ వైరల్ అయిపోయాయి. ఇంతకు ఆఎంపీ ఎవరనే కదా.. మీ ప్రశ్న.
ఆ ఎంపీ గౌతం గంభీర్. అదే వెటరన్ క్రికెటర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న గంబీర్ .. ఈ మధ్య నియోజకవర్గంలో గయాబ్ అయిపోయారట. ఒకవైపు డిల్లీ వాయుకాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాయుకాలుష్యంపై .. ఈనెల 15 న డీల్లీ అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఇంత కీలక సమావేశానికి కూడా గంబీర్ డుమ్మా కొట్టాడు. ఈయనకు తోడు అదికారుల కూడా ఆ సమావేశానికి రాకపోవడంతో.. ఏకంగా ఆ సమావేశామే రద్దు అయ్యిందట.

దీనితో రగిలిపోతున్న డిల్లీ ప్రజలు.. అదే గంబీర్ ఓటర్లు.. తమ ఎంపీగారు కనబడుట లేదని.. ఏకంగా పోస్టర్లు వేసారు. పార్లమెంట్ సమావేశాలు కూడా షురూ అవడంతో.. కనీసం వాటికైనా గంబీర్ హజరవుతరా.. లేక .. కాలుష్యం బాధ నాకేందుకు అంటూ.. గయాబ్ అవుతారో చూడాలి. మొత్తానికి మొన్నటి వరకు.. గ్రౌండ్ లో బ్యాట్ తో బౌలర్లను ఆడుకున్న గంబీర్ ను.. ఇప్పుడు ఓటర్లు తమ పోస్టర్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు.
Very Nice