అవసరం ..సమయంను బట్టి వస్తువు డిమాండ్ పెరుగుతుందుని మార్కెట్ రంగ నిపుణులు చెబుతుంటారు .. అదేంటో ఇప్పుడు ఆవు పేడకు నెలకొన్న డిమాండ్ చూస్తుంటే అర్థం అవుతుంది . అదేంటి అనుకుంటున్నారా .? అవును ఇప్పుడు ఆవు పేడతో చేసే ఒక్క పిడకకు రూ.214 ధర పలుకుతుంది. మామూలుగా ఆవు పేడను గోడలకు కొట్టి పిడకలుగా చేయడం పల్లెల్లో చూస్తూ ఉంటాం. ఈ పేడను ఎరువుగా కూడా వాడుకుంటాము… ఇప్పుడు ఇది అంటురోగాలకు దూరంగా ఉంచేదిగా వైద్యపరంగా నిర్ధారణకావడంతో చర్మవ్యాధులకు, రక్త హీనతకు కూడా వాడుతున్నారు. ఇక సాంప్రదాయ పరంగా కార్తీక మాసంలో ఆవు పేడతో చేసే పిడకలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక విదేశాల్లో ఉన్న భారతీయుల్లో డిమాండ్ తో పిడకలను కవర్లలో ప్యాక్ చేసి పట్టణాలకు , విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఇట్లా ప్యాక్ ఐన ఒక్క ఆవు పేడ తో చేసిన పిడక ధర యుఎస్ లో మూడు డాలర్లు పలుకుతుంది . పైగా ఈ పిడకల పేరు కేక్ అని గుండ్రని షేప్‌తో అమ్మేస్తున్నాయి.. ఫ్లిప్ కార్టు, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్లు అమ్మకానికి ఉంచుతున్నాయి. ఇప్పుడు ఈ పిడకల ఫొటోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఆవు పేడ అని నమ్మి తీసుకుంటున్న వారు ఇవి భారత ఆవుల నుంచి తీసుకొచ్చినదా.. లేదా అక్కడే ఉండే యాంకీ ఆవులదా అనే సందేహం వ్యక్తం చేశారు ఆ నెటిజెన్ .. ఐతే ఎక్కడివి అయినా పరవాలేదు కరెక్ట్ టైంకి మార్కెట్లోకి దొరుకుతున్నాయి ఇదే పదివేలు అంటున్నారు వినియోగదారులు.
Tags: subzi mandi, cow dung online price, social media, viral news, yanki dung
- Design