హైదరాబాద్: ఆమె ఎందరో కరోనా బాధితులను కాపాడింది. విధి నిర్వహణలో భాగంగా కరోనా రోగులకు సేవలందించింది. కరోనా బాధితులకు ఆమె ధైర్యాన్నిచ్చింది. వ్యాధిని సంకల్ప బలంతో ఎదురుకోవాలని చెప్పింది. మహమ్మారి బారిన పడిన వ్యాధిగ్రస్తులను కాపాడుతూ.. చివరికి ఆమె కూడా కరోనాతో మృత్యు ఒడిలోకి చేరుకుంది. కరోనాతో చెస్ట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్నర్సు శుక్రవారం మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇక్కడ మరొక విషాదం ఏమిటంటే ఈ నెల 30న ఆమె హెడ్ నర్సుగా పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవల హెడ్నర్సు భర్తకు కూడా కరోనా సోకింది. దీంతో భర్త హోంక్వారంటైన్లో ఉన్నారు. 20 రోజుల ముందు వరకు ఆమె కరోనా విధులు నిర్వహించింది.