మంత్రి కుమారుడిని అడ్డుకుందని కానిస్టేబుల్ సునితను బదిలీ చేశారు.
సలాంకొట్టే గులాంగిరీ తాను చేయలేనని ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇది కదా ఆత్మగౌరవం అంటే..
సినిమాల్లో కూడా చూడలేని ధైర్యం…
మంత్రికొడుకుని రఫ్ ఆడించింది.పై అధికారులు మందలిస్తే రాజీనామా చేసింది… అధికారులముఖంమీదనే మీలాగా నేను చట్టాన్ని కాదని బానిస బ్రతుకు బ్రతకలేనని చెప్పింది. ఈమె పేరు
సునీత యాదవ్.. రాత్రి లాక్డౌన్ లో ఆరోగ్యమంత్రి కొడుకు కారులో బలాదూర్‌గా తిరుగుతుంటే నిలేసింది.
మంత్రి ఫోన్ చేసినా ఖాతరు చేయలేదు. కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ పీకించింది. మంత్రితో ఆమె మాట్లాడిన వీడియో ఆమె నీతికి, నిజాయితీకి, నిర్భీతికి నిదర్శనం..
కానీ దురదృష్టవశాత్తు అధికారులు ఆమెనే తప్పు పట్టారు.. అంతే ఉదయాన్నే రాజీనామా గీకి అధికారుల ముఖంమీద కొట్టింది… ఇప్పుడు దేశంలో నెటిజెన్లుఆమెనే కీర్తిస్తున్నారు..