తెలంగాణలో రాబోయేది బిజేపి ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదించుతాం.. ఇక కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది.. అంటు ఇలాంటి కామెంట్స్ బిజేపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి రోజు ఎక్కడో అక్కడ మాట్లాడుతున్న వార్తలు మనము చూస్తునే ఉన్నాం. అయితే ఆపార్టీకి రాష్ట్రంలో ఒకే ఓక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే రాజాసింగ్. కేసీఆర్ రెండో సారి హవాలో కూడా గోషామహల్ లో కాషాయ జంఢా ఎగరేశారు రాజాసింగ్. అంతేకాదు.. నగరంలో ఎదో సమస్యపై నిత్యం స్పందిస్తూనే ఉంటారు. ఇక పార్టీ లో ఏ నాయకుడు మాట్లాడని విధంగా.. హిందుత్వాన్ని తన భుజానా ఎత్తుకుని తిరుగతుంటారు. కాని.. ఇప్పుడు ఈ రాజాసింగ్ పరిస్థితి పార్టీలో దయనియంగా ఉందట. అసెంబ్లీ సమవేశాలలో బిల్లులపై తాను మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. పార్టీ నుండి ఎలాంటి సహకారం లేదని వాపోతున్నారు రాజాసింగ్. సభలో పార్టీ వాయిస్ ను వినిపించేందుకు ఉన్నఒక్క ఆవకాశాన్ని కూడా పార్టీ ఉపయోగించు కోవడంలేదనేది ఆయన ఆవేదన. అసెంబ్లిలో బిల్లులపై మాట్లాడాలంటే.. దానికి కావలిసిన సమాచారాన్ని ప్రతి పార్టీ సభ్యునికి అందుబాటులో ఉంచుతుంది. అందులోను బిజేపీలో అయితే.. దీనికోసం ప్రత్యేకంగా ఓ విభాగమే అందుబాటులో ఉంటుంది. అదే విభాగం.. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పార్టీ ఫ్లోర్ లీడర్లు గా ఉన్నప్పడు వారికి కావలిసిన సమాచారాన్ని అంతా ప్రతిరోజు టేబుల్ పై రెఢీగా ఉంచేది.
మరి ఇప్పుడు రాజాసింగ్ ను మత్రం పట్టించుకోవడంలేదు. రాజాసింగ్ కు ఎందుకు పార్టీ సహకరించడం లేదన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అంటే రాజాసింగ్ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం రాష్ట్ర పార్టీకి ఇష్టంలేదా..? మరి అలాగైతే.. బిజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్.. కేసీఆర్ ను గద్దెదించుతామని ప్రకటనలు చేయడం అంతా డూపేనా..? ఇలా ఉంటే.. రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఎదుర్కోని బిజేపీ ఎప్పడు అదికారంలోకి వస్తుంది.. ఇది ఇప్పుడు పార్టీలో కార్యకర్తలనే కాదు.. రాజకీయ పరిజ్ఙానం ఉన్నవారిని అందిరిని వేదిస్తున్న ప్రశ్న. ఈ వ్యవహారంపై రాజాసింగ్ అభిమానులు మాత్రం రగిలిపోతున్నారు. పార్టీ కోసం కాకుండా స్వంత ఎజెండాలతో కేసీఆర్ తో మిలాఖత్ పాలిటిక్స్ చేస్తూ.. ఈ డూప్ ఫైట్ చేయడం ఏంటని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.