పులస చేప 21 వేలు..
పులస.. ఈ చేప గురించి చాలా మందికి తెలియదు. గోధావరి జిల్లాల్లోని వారికి మాత్రం పులస గురించి బాగా తెలుసు. చేప బోజన ప్రియులకు సైతం పులస గురించి తెలుసనుకొండి. మరో విషయం ఏంటంటే.. బంగారు పుస్తెలు అమ్మైనా పుసల తినాలని గోధావరి జిల్లాల్లో ఓ సామెత ఉంది. దీన్ని బట్టే తెలుస్తుంది పులస చేపకు ఉన్న డిమాండ్. ఇక అసలు విషయానికి వస్తే పులస చేప చాలా అరుదైనది. ప్రపంచంలో కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే పులస చేప దొరుకుతుంది. అది కూడా వర్షాకాలంలో మాత్రమే చాలా అరుదుగా చిక్కుతుంది ఈ చేప. అందుకే అరుదైన పులస చేప కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద అధికారులకు పులస చేప కూర తినిపిస్తే.. ఏ పనైనా చేసిపెడతారన్న నానుడి కూడా ప్రచారంలో ఉంది.
పులస చేప కేవలం వర్షాకాలంలో.. సముద్రం నుంచి గోదావరి నదికి ఎదురు ఈదు కుంటూ వస్తుంది. సముద్రం ఉప్పు నీటి నుంచి గోదావరి వరదలోకి రాగానే దానికి ఎనలేని రుచి వస్తుందని చెబుతారు. ఇలా సముద్రం నుంచి ఎదురీదే పులస చేప.. చాలా అరుదుగా వలలో చిక్కుకుంటుంది. ఎంతో రుచికరమైన ఒక పులస చేప వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. ఈ పులస కోసం చాలా మంది మాంసాహార ప్రియులు పోటీ పడగా.. పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు 21 వేల రూపాయలకు వేలం పాడి మరీ సొంతం చేసుకున్నారు. అంటే కిలో దాదాపు పది వేల రూపాయలు పడిందన్న మాట. ఇదండీ పులస చేప స్పెషాలిటీ. ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే.. పులస చేప వండుతుంటే.. ఆ వాసన సుమారు కిలోమీటరు వరకు వస్తుందట. అందుకే అవకాశం ఉంటే.. మీరు ఓ సారి పులస చేప తినడానికి ప్రయత్నించండి మరి.