ఖర్చుల కోసం నగలు అమ్ముకున్న అంబానీ
ఎంటీ హెడ్ లైన్ చదివి షాక్ అయ్యారా.. మీరు చిదివింది అక్షరాల పచ్చి నిజం. ప్రపంచ ధనికుల్లో ఒకరైన అంబానీ ఎంటీ.. ఖర్చుల కోసం నగలు అమ్ముకోవడం ఎంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే మీరనుకుంటున్నట్లు నగలు అమ్ముకున్నానని చెబుతున్నది అపర కుబేరుడు ముఖేష్ అంబాని కాదండీ.. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ. అయ్యో ఆయనకు మాత్రం అంక కష్టం ఏమొచ్చిందని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మూడు చైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. రిలయన్స్ జియో ప్రవేశంతో పూర్తిగా దివాలా తీసిన అనిల్ కంపెనీ.. ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. తమకు రావాల్సిన 68 కోట్ల డాలర్ల బకాయిల కోసం చైనా బ్యాంకులు లండన్‌లోని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించాయి. ఈ రుణానికి అనిల్ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని, ఆయన ఆస్తుల విక్రయం ద్వారా బకాయిల రికవరీకి అవకాశం కల్పించాలని బ్యాంకులు కోరాయి.
బ్రిటన్ కోర్టు సైతం చైనా కంపెనీలకు అనుకూలంగా తీర్పిచ్చింది. జూన్ 12కల్లా 3 బ్యాంకులకు బకాయిలు చెల్లించాలని మే 22న కోర్టు అనిల్‌ను ఆదేశించింది. కానీ, అంబానీ బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యారు. దాంతో చైనా బ్యాంక్‌లు జూన్ 15న మళ్లీ లండన్ కోర్టును ఆశ్రయించాయి. కోర్టు విచారణలో అనిల్ పూర్తిగా చేతులెత్తేశారు. కోర్టు ఖర్చుల కోసం నగలన్నీ అమ్మేయాల్సి వచ్చిందని బ్రిటన్ న్యాయస్థానం ధర్మాసనం ముందు అనిల్ వాపోయారు. పలు మీడియా కథనాల్లో పేర్కొన్నట్లుగా ప్రస్తుతం తనది విలాస జీవనశైలి కాదని.. తాను సామాన్య జీవితం గడుపుతున్నానని చెప్పారు. తానెప్పుడూ రోల్స్ రాయిస్ లాంటీ విలాసవంతమైన కారు కొనలేదని.. ప్రస్తుతం తనవద్ద ఒకే ఒక కారు ఉందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ఖర్చులు సైతం చాలా తక్కువని, వాటిని తన భార్య, కుటుంబ సభ్యులే భరిస్తున్నారని అనిల్ అంబాలీ కోర్టుకు చెప్పారు. ప్రపంచంలోని పది మంది ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సొంత తమ్ముడు.. దేశంలోని కార్పొరేట్ ప్రముఖుల్లో ఒకరైన అనిల్ అంబానీ ఇలా కోర్టు ఖర్చుల కోసం నగలు అమ్ముకున్నానని చెప్పడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.