News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వెంకయ్యకు కరోనా పాజిటివ్..


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. రొటీన్‌గా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఐతే వెంకయ్యనాయుడు సతీమణి ఉషకు కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. వెంకయ్య నాయుడుకు కరోనా సోకినా లక్షణాలేవీ కనిపించలేదని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఉపరాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఐనప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన విషయం తెలియగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్‌ చేసి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ సలహా మేరకు వెంకయ్యకు సీటీ స్కాన్‌ నిర్వహించగా ఛాతీ, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాయని, కరోనా ప్రభావం అత్యంత స్వల్పంగా మాత్రమే ఉన్నట్టు తేలిందని అధికారులు తెలిపారు. రాజ్యసభ సమావేశాల సందర్బంగా.. రాజ్యసభ సిబ్బందిలో 83 మందికి, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందిలో 13 మందికి కరోనా సోకింది. నిత్యం వ్యాయామం చేస్తూ, నడకకు ప్రాధాన్యమిచ్చి ఆరోగ్య సూత్రాలు పాటించే వెంకయ్య క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.