News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నన్ను పోలీసులే తోసేశారు.. రాహూల్


ఉత్తర్ ప్రదేశ్ లో ఒక దళిత యువతి పైన గ్యాంగ్ రేప్ జరిగి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనపై రాహూల్ గాంధీ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా దహనం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక బయల్దేరాగా.. వారిని పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ వద్ద అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కార్యకర్తలతో కలిసి నడక వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకునే క్రమంలో రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఒకానొక సమయంలో పోలీసులు రాహుల్ గాంధీని కిందకి తోసేశారు. దీనిపై రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులే తనను కిందకు తోసేశారని.. తనపై లాఠీఛార్జ్ చేశారని రాహూల్ అన్నారు. ఏ చట్టం కింద తనను అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. రోడ్డుపై కేవలం ప్రధాని మోదీయే నడవాలా.. సామాన్యులు నడిచే హక్కు లేదా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహూల్ గాంధీ.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.