ఉత్తర్ ప్రదేశ్ దళిత యువతిపై అత్యాాచారం రేపిస్టులను ఉరి తీయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేతల క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యూపీ రేపిస్టులను ఉరి తీయలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల ప్రదర్శించారు. మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్యాండిల్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, వంశీచంద్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల, ఫిరోజ్ ఖాన్, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, మానవత రాయ్ తదితరులు పాల్గొన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.