News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

2022లోనే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికలతో పాట అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు 2022లో వస్తాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు. శుక్రవారం అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రణాళికా బద్దంగా సమాయుత్తం కావాలని.. నిరంతరం ప్రజల్లో ఉండాలని దిశానిర్ధేశం చేశారు. కరోనా కాలంలో వ్యాధులు పెరిగి.. ఆదాయాలు పడిపోయి ప్రజలు సతమతమవుతుంటే వారిని జగన్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

- Advertisement -

ఓ వైపు ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు జగన్ అండ్ టీం జేబులు నింపుకొనే పనిలో పడిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ దోపిడీ పాలనను చూస్తూ ఊరుకోమన్న ఆయన.. కరోనా పోయిన తర్వాత తాను రాష్ట్రమంతా తిరిగి ప్రజలను కలుస్తానని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారి కోసం గళం విప్పుతానని.. వారి తరపున పోరాడతానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానిది అరాచక పాలన అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగని రోజంటూ లేదని ఆవేధన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.