News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఫోటోలో ఉన్నది నేనే.. ఐతే ఏంటీ

విదేశీ అమ్మాయి షాంపేన్ పోస్తుంటే.. తాను తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై ఏపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు. ఆ ఫోటోలో ఉన్నది తానేనని ఆయన చెప్పారు. ఐతే తన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్న వారిపై రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ.. మీ బాబాయ్ గారే ఈ ఫోటోను బయట పెట్టారని తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఫంక్షన్‌లో తీసిన ఫోటో అదని తెలిపారు. ఐతే ఈ ఫోటో తానెప్పుడు చూసుకోలేదన్న రాజు.. ఇందులో తాను ఎవరినీ ముట్టుకోలేదని.. షాంపేన్ మాత్రం తాగానని చెప్పారు. హైదరాబాద్ లో లేదంటే కలకత్తాలోనో జరిగిన ఫంక్షన్ లో తీసిన ఫోటో అని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ ఇచ్చిన ఫంక్షన్‌లో తీసిన ఫొటో ఇదని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఫంక్షన్ లలో రష్యన్ అమ్మాయిలు రావడం సహజమేనని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఏపీలో అమ్ముతున్న ప్రెసిడెంట్ మెడలో… నోబుల్ ప్రైజ్ లాంటి చెత్త బ్రాండ్ డ్రింక్ కాకుండా మంచి షాంపేన్ తాగానని ఎద్దేవా చేశారు. తనను అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న వారి సంగతి ఫిర్యాదు ఢిల్లీ పోలీసులు చూసుకుంటారని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.