దుబ్బాకలో ఓడిస్తేనే.. కేసీఆర్ కు ఇచ్చిన హామీలు గుర్తొస్థయ్..
దుబ్బాకలో టిఆర్ఎస్ ను ఓడిస్తేనే ..కేసీఆర్ కు గతంలో తాను ఇచ్చిన హామిలన్నీ గుర్తుకొస్తాయని అన్నారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్నటి దాకా మొక్కజొన్న వేయొద్దని.. వేస్తే ప్రభతు్వం కొనుగోలు చేయదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు దుబ్బాకలో గెలుపుకోసం.. 1850 ధరతో గ్రామాల్లోకి వచ్చే కొనుగోలు చేస్తామంటున్నారని అన్నారు ఉత్తమ్. అంతేకాదు.. ఐదేళ్ళుగా ఉధ్యోగుల డిఏ, పీఆర్సి గురించి హేళనగా మాట్లాడిన సిఎం.. ఇప్పుడు డిఏను ఇస్తామని ప్రకటించడం.. దుబ్బాక ప్రజల నైతిక విజయం అన్నారు.
దుబ్బాక ఎన్నికలతో ఉధ్యోగులకు డిఏ.. మొక్కజొన్న కొనుగోలుపై కేసీఆర్ దిగివచ్చారని.. అదే దుబ్బాకలో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపిస్తే.. దళితులకు మూడెకరాల భూమి , డబల్ బెడ్ రూమ్ ఇల్లు , ఆరోగ్య శ్రీ , ఇంటికో ఉద్యోగం , ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల్ లు, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇలా.. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తారని అన్నారు ఉత్తమ్. పొరపాటును కారును గెలిపిస్తే.. మరోసారి ఏ హామి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తారని జొష్యం చెప్పారు పీసీసీ ఛీప్ . దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర రాజకీయలను మలుపుతిప్పుతుందని అన్నారు.
తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతకమ్మ పండుగ సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాలతో, సంప్రదాయ బద్దంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.