News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆ టీవీలపై 6 లక్షల రూపాయల డిస్కౌంట్..

- Advertisement -

ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ దసరా.. దీపావళి సందర్బంగా భారీ ఆఫర్ ను ప్రకటించింది. అత్యాధునిక ప్రీమియం క్యూలెడ్ 8కె టీవీలను లాంచ్ చేసిన శాంసంగ్ ది 8కె ఫెస్టివల్ పేరుతో వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను తెచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా టీవీలపై సుమారు 6 లక్షల 30 వేల వరకు రాయితీ ఇస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ షోరూంలలో ఈ నెల 24 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని శాంసంగ్ తెలిపింది. అన్ని క్యూలెడ్ 8కె రేంజ్ మోడల్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది శాంసంగ్. ఇక ఈటీవీల రేంజ్ 4లక్షల 99 వేల రూపాయల నుంచి 15 లక్షల 79 వేల వరకు ఉంది. 65 అంగుళాల మోడళ్లపై 1 లక్షా 30 వేల నుంచి 1 లక్షా 89 వేల వరకు డిస్కౌంట్ ఇస్తుండగా, 75 అంగుళాల మోడళ్లపై 3 లక్షల 50 వేల రూపాయలు, 82, 85 అంగుళాల టీవీలపై 5 లక్షల నుంచి నుంచి 6 లక్షల 30 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది శాంసంగ్.

Leave A Reply

Your email address will not be published.