నేను రిటైర్ అవుతున్నా.. కానీ
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిమానులకు కాసేపు షాక్ ఇచ్చింది. తాను కెరీర్ నుంచి రిటైరవుతున్నట్టు ఆమె చేసిన ట్వీట్ అందరిని షాక్ కు గురిచేసింది. నేను రిటైరవుతు.. న్నా డెన్మార్క్ ఓపెనే ఆఖరిది అని సింధు సోమవారం తన ట్విటర్లో పోస్ట్ చేసింది. పీవీ సింధు ప్రకటనను చాలా మందికి అర్థ కాకపోడంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత తన ప్రకటన వెనకున్న ఉద్దేశాన్ని సింధు వివరించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణ జీవనంపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపించిందో వివరించడానికి నేను చేసిన పోస్టును అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవద్దు.. దయచేసి ఆ పోస్టును పూర్తిగా చదవాలి అని సింధు విజ్ఞప్తి చేసింది.
ఇన్ని నెలలు గడుస్తున్నా మనం ఇంటినుంచి బయటకు వెళ్లే ప్రతిసారి వైరస్ నుంచి రక్షించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. కంటికి కనపడకుండా ప్రపంచాన్నంతటిని వేధిస్తున్న కరోనాను ఎలా ఓడించాలి.. కొవిడ్‌కు సంబంధించి ఆన్లైన్లో తెలుసుకున్న అనేక విషాద ఘటనలు నాలో పలు ప్రశ్నలను రేకెత్తించాయి.. డెన్మార్క్ ఓపెన్‌లో ఆడలేకపోవడమే ఈ వరుస విషాదాలలో చివరిది కావాలి.. నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా.. అనే ప్రకటన మీకు బాధను కలిగించి ఉంటుంది. అయితే, వీడ్కోలు పలుకుతుంది ఆటకు కాదు. అనిశ్చిత పరిస్థితులు, ప్రతికూల ఆలోచనలకు వీడ్కోలు ఇస్తున్నా. కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఎలా పోరాడతానో.. కొవిడ్ వల్ల నెలకొన్న విపత్కర పరిస్థితుల మీద కూడా అలాగే పోరాడతా అని సింధు తన ట్వీట్లో పేర్కొంది. దీంతో సింధు రిటైర్మెంట్ ట్వీట్ గంధరగోళానికి ఎండ్ కార్డ్ పడింది.