News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వరద సాయం అవకతవకలపై న్యాయవిచారణ జరపాలి

హైదరాబాద్ వరదలల్లో నష్టపోయిన ప్రజలకు సహాయం అందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ తో పాటు కొండా విశ్వేశర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వరద సాయం అవకతవకలపై గవర్నర్ తమిళసై తో ఫోన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డిలు మాట్లాడారు. వరదలపపైన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పూర్తిస్థఆయిలో న్యాయ విచారణ జరపాలని గవర్నర్ ను ఉత్తమ్ కోరారు. వరద నష్ట వివరాలను పారదర్శకంగా, సాంకేతికంగా చేపట్టాలని ఉత్తమ్ సూచించారు.

- Advertisement -

వరదల వల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి కనీసం 50 వేలు ఇవ్వాలని, కూలిపోయిన ఇళ్లకు 5 లక్షలు, పాక్షికంగా నష్టపోయిన ఇళ్లకు 2.5 లక్షలు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. ఇది పట్టపగలు జరిగిన దోపిడని ఉత్తమ్ ఆరోపించారు. నగరంలో వరద సాయం పేరుతో అనర్హులకు పరిహారం ఇచ్చారని. నిజంగా నష్టపోయిన బాధితులకు సాయం అందలేదని ఆయన అన్నారు. బాధితులకు పరిహారం నగదు రూపంలో ఇష్టానుసారంగా ఇస్తూ… టిఆర్ఎస్ కార్యకర్తలు దోచుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. వరద సాయం పేరుతో జరిగిన దోపిడిపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.