News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ ఎస్ కు షాక్ ఇచ్చిన ఓటర్లు

- Advertisement -

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావించిన దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గులాబీ జెండా ఎగిరింది. టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత, మంత్రి హరీశ్‌రావు అహర్నిశలు శ్రమించినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారు. దుబ్బాక ఉప ఎన్నికలో హోరాహోరిగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రౌండ్‌ రౌండ్‌కూ మలుపు తీసుకుంటూ కౌంటింగ్‌ ఆసక్తికరంగా సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు‌కు 63 వేల 353 ఓట్లు రాగా, సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 62 వేల 273 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి 22 వేల 196 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.