అమెరికా అధ్యక్ష్య పదవిపై ఇంవాక కన్ను..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కన్నుపడింది. భవిష్యత్‌లో అమెరికా అధ్యక్ష్య పదవిని చేపట్టేందుకు ఆమె వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం జరిగిన ఎన్నికల వ్యవహారంలో తన తండ్రి వైఖరిపై ఇవాంక అసహనంతో ఉన్నారట. అంతే కాదు ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. ఇవాంక వ్యవహార శైలి అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మరో నాలుగేళ్లు వైట్ హౌజ్ ను ఏలాలని డొనాల్డ్ ట్రంప్ ఆశపడ్డారు. కానీ అమెరికా ఎన్నికల్లో అనూహ్యంగా జో బైడెన్ గెలుపొందారు. కానీ ట్రంప్ మాత్రం తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
స్పష్టంగా ఎన్నికల ఫలితాలు జో బైడెన్ గెలుపును ఆయన అంగీకరించడం లేదు. కోర్టుకు వెళ్లి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన కూతురు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. ట్రంప్ ను మిగతా కుటుంబ సభ్యులు సమర్ధిస్తున్నా.. ఇవాంక మాత్రం వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ఫలితాలపై తన తండ్రి చేస్తున్న ఆరోపణలను సమర్ధిస్తూ ఇప్పటి వరకు ఇవాంక ట్రంప్ సోషల్ మీడియాలో ఒక్కపోస్టు కూడా పెట్టలేదు. అంతే కాదు ఓటమిని అంగీకరించేలా ట్రంప్‌ను ఒప్పించే పనిలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. హుందాగా ఓటమిని అంగీకరించాలని డొనాల్డ్ ట్రంప్‌కు అతని అల్లుడు జేర్డ్ కుష్నర్ సూచించారు కదా… దీని వెనక కూడా ఇవాంక హస్తం ఉన్నట్లు అమెరికా మీడియా అంటోంది.