ట్రంప్ కు విడాకులిచ్చేందుకు సిద్దమైన భార్య
అమెరికా ఎన్నికల్లో పరాజయం పొందిన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు చెప్పేందుకు మెలానియా నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్ స్పష్టం చేసింది. ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధంగా ఉందని.. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదని.. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారని ఒమరోసా చెప్పారు. ఒక వేళ ట్రంప్ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీ మొత్తంలో భరణం అందనుందట. ఈ భరణం విలువ సుమారు 500 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. అసలే ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఇప్పుడు భార్య సైతం విడిపోవడం తలనొప్పిగా మారింది.