News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈ సారైనా నయనతార..

- Advertisement -

అందాల భామ నయనతార ఎప్పుడూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అందరికి తెలిసిందే. హీరోయిన్‌గా నంబర్ వన్ ప్లేస్ లో ఉంటూనే.. సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో చాలాకాలంగా ప్రేమాయనం నడుపుతోంది. ఇప్పటి వరకు చాలా సార్లు పెళ్లి వరకు వచ్చి క్యాన్సిల్ కావడంతో.. మరి ఇప్పుడైనా విఘ్నేష్‌నైనా నయనతార పెళ్లి జరుగుతుందా అన్నదే అభిమానుల్లో సందేహం. ఇదే విషయాన్ని ఈ సందరిని అడిగితే మీకెందుకు అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా వీరిద్దరూ భార్యభర్తల కంటే ఎక్కువ అన్నట్లుగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు విఘ్నేష్‌ శివన్ సోషల్ మీడియాలో‌ షేర్‌ చేసిన ఫొటో చూస్తే.. వీరిద్దరూ ఎంత గాఢమైన ప్రేమలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరి విఘ్నేష్, నయన్ లు పెళ్లి పీటలెప్పుడు ఎక్కుతారన్నదే అందరిలో ఆసక్తి.

Leave A Reply

Your email address will not be published.