News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ భహిరంగ లేఖ

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో గత రెండు నెలలుగా వరదనీటితో ఇబ్బంది పడుతున్న పలు కాలనీల ప్రజలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన భహిరంగ లేఖ రాశారు. గత రెండు నెలలుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం జల్పల్లి మునిసిపాలిటీలోని చాలా కాలనీలు వరదనీటిలో ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. బురద నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉస్మాన్ సాగర్, సయిఫ్ నగర్. అబ్దుల్లా నగర్ వాసులను ఆదుకోవాలని ఆయన సీఎంకు రాసిన లేఖలో కోరారు. వరద ముంచెత్తి రెండు నెలలు అవుతున్నా.. ఇంతవరకు ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం దృష్టికి తెచ్చారు. ఆయా కాలనీల పరిస్థితిపై సంబందిత అధికారులు, కలెక్టర్లను వివవరణ కోరగా.. ప్రభుత్వానికి నివేధికలు పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేస్తామని చెబుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తక్షణమే యుద్దప్రాతిపదికన వరద నీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో సహాక చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా కాలనీల్లో నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఇంటికి లక్ష రుూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ డిమండ్ చేశారు. వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.