News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా..

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను‌ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి చెప్పారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్ధసారథి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ పదవి మహిళ (జనరల్)‌కు కెటాయించినట్లు కమీషనర్ తెలిపారు.

జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్…

నవంబర్18 నుంచి నామినేషన్ల స్వీకరణ

నవంబర్ 20న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు

- Advertisement -

నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన

నవంబర్ 24న నామినేషన్ల ఉపసంహరణ

డిసెంబర్ 01న పోలింగ్

డిసెంబర్ 03న అవసరమైతే రీపోలింగ్

- Advertisement -

డిసెంబర్ 04న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి.

Leave A Reply

Your email address will not be published.