ఏపీలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమీషన్ కసరత్తు ప్రారంభించింది. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఈయన పేర్కొన్నారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందని రమేశ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని గుర్తు చేసిన రమేశ్ కుమార్, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. మరి ఈ అంశంపై జగన్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తున్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.