News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అలా ఐతే ఇలా ఒంటరిగానే ఉండిపోతా..

- Advertisement -

దక్షిణాది సినీ పరిశ్రమలో అందాల భామ త్రిష రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. త్రిష కంటే జూనియర్‌ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటున్నారు. ఐతే త్రిష మాత్రం ఇప్పటి వరకు పెళ్లి ఉసే ఎత్తడం లేదు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటున్నావ్ అన్న అభిమానుల ప్రశ్నకి త్రిష సమాధానమిచ్చింది. నన్ను పూర్తిగా అర్థం చేసుకోగల వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను.. ఒక వేళ నేను కోరుకున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తారసపడకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అని చెప్పుకొచ్చింది ఈ చెన్నై ముద్దుగుమ్మ. 2015లో వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తరువాక ఏం జరిగిందో ఏమో కానీ అర్దాంతరంగా పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష సినిమాల బిజీతో పెళ్లిని పక్కన పెట్టేసింది. మరి త్రిషకు నచ్చిన వాడు దొరుకుతాడా.. లేక ఇలా ఒంటరిగానే ఉండిపోతుందా అన్నదే ఆమె అభిమానుల సందేహం.

Leave A Reply

Your email address will not be published.