News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మేం పోటీ చేయం-బీజేపీకి మద్దతివ్వండి

- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన పవన్.. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని బీజేపీకి మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ క్యాడర్ కు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.