ఢిల్లీకి దూరంగా ఉండాలంటున్న వైద్యులు
ఢిల్లీ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అంతకంతకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యులు సోనియాకు ఈ సలహా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ గత కొంత కాలంగా ఛాతి ఇన్ఫెక్షన్తో బాధడుతున్నారు. సెప్టెంబర్ లో సాధారణ వైద్య పరీక్షల కోసం కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, ఛాతి నొప్పి కూడా పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. అందువల్ల ఢిల్లీ వదిలి కొన్నాళ్లు కాలుష్యం లేని ఇతర ప్రాంతానికి వెళ్లాలని సోనియా గాంధికి వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సోనియా చెన్నై లేదా గోవా వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం.