News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన తెలుగు అమ్మాయి

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తరాది హీరోయిన్లదే అగ్రస్థానం. తెలుగు చిత్రాల్లో నటించడానికి వస్తున్న వారంతా ముంబై నుంచి వస్తున్నవారే. తెలుగు అమ్మాయిలు ముంబైకి వెళ్లి హీరోయిన్లుగా సెటిల్ అయినవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. తెలుగు అమ్మాయిలు టబు, దియా మీర్జా, అదితీరావు హైదరి వంటి కొంతమందే మాత్రమే ఈ కోవలోకి వస్తారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అందాల భామ అమ్రిన్‌ ఖురేషి చేరుతోంది. రెండు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది అమ్రిన్ ఖురేషి.

- Advertisement -


తెలుగులో సక్సెస్ సాధించిన సినిమా చూపిస్త మావ కి రీమేక్‌గా హిందీలో రూపొందుతున్న బ్యాడ్‌బాయ్‌ లో అమ్రిన్‌ ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో సాజిద్‌ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న జులాయి హిందీ రీమేక్‌లోను అమ్రిన్ ఖురేషి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ సినిమా దర్శక, నిర్మాత సాజిద్‌ ఖురేషి కుమార్తె అమ్రిన్‌.

Leave A Reply

Your email address will not be published.