News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అవినీతి టీఆర్ ఎస్- మతతత్వ బీజేపీ-ఎంఐఎం ను ఓడించండి

భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ తెలంగాణకు వచ్చినట్లున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వెళ్లి డబ్బు ఆశ చూపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ నేతల దగ్గరికి వెళ్లడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాలని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. బస్‌ షెల్టర్లు, మెట్రో పిల్లర్లు, పబ్లిక్‌ టాయ్‌లెట్ల పైన టీఆర్‌ఎస్‌ ప్రకటనలను తొలగించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తమ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిని కలిసి ఫిర్యాదు చేసింది.

- Advertisement -


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలని ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైల్‌ పనులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి 67 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని టీఆర్‌ఎస్‌ చెబుతోందన్న ఉత్తమ్.. ఏం అభివృద్ధి చేశారో, ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయో టీఆర్ ఎస్ నేతలే చెప్పాలని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒవైసీ సోదరులు అమిత్‌షాను కలిశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అవినీతి టీఆర్‌ఎస్‌, మతతత్వ బీజేపీ, మజ్లిస్‌ పార్టీలను ఓడించాలని, హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పులుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.