హైదరాబాద్ లో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫాంహౌజ్లో పడుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్కు కనీసం వరద బాధితుల్ని పరామర్శించే సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నియంత ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అసమర్థత, అవినీతికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరోపేరని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ నాయకులు అర్థరాత్రి కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలో చేరాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి హైదరాబాద్ వాసులను ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పిన ఉత్తమ్.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.