News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సినీ పరిశ్రమను కాపాడుకుంటాం

- Advertisement -

సినీ పరిశ్రమను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయి, సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ పరిశ్రమకు,  సినీ కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సినీ పరిశ్రమ పెద్దలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ను కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగా.. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, చిరంజీవి, నాగార్జున, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించేందుకు త్వరలోనే చిరంజీవి నివాసంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.