News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వరాల జల్లు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే వరద బాధితులకు 50 వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జీహెచ్ ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి 2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హస్తం పార్టీ మోనిఫెస్టోలో పేర్కొంది.

మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని కాంగ్రెస్ ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేస్తామని తెలిపారు.

- Advertisement -

ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఏఐసిసి ఇంచార్జ్ మానికమ్ ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీ పూర్తి మేనిఫెస్టో కోసం క్రింద క్లిక్ చేయండి

Congress Party GHMC Manifesto – 2020

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.