గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్,బీజేపీ డూప్ ఫైట్ చేస్తున్నాయని న్నారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జీఎస్టీ,పెద్దనోట్ల రద్దు,రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల వరకు.. కేసీఆర్ బిజేపీ మద్దతిచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్రేటర్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే.. బిజేపీ, టిఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు ఉత్తమ్. గాంధీ భవన్ లో సీనియర్ అహ్మద్ పటేల్ చిత్రపటానికి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ,లతో కలిసి.. ఉత్తమ్ నివాళులు అర్పించారు. ఇక పాతబస్థిపై సర్జీకల్ స్ట్రైక్స్ చేస్తామంటు బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఉత్తమ్. బండి వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి అద్దం పడుతున్నాయని అన్నారు. బండి సంజయ్ ఇప్పడు హైదరాబాద్ లో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డ ఉత్తమ్., ఇంతకు బండి సంజయ్ కు హైదరాబాద్ ఎక్కడుందో తెలుసా అని అన్నారు ఉత్తమ్.
ఈ సందర్బంగా మాట్లాడిన రాష్ట్ర ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ .. ప్రజలను బీజేపీ మత పరంగా విభజించాలని చూస్తుందని అన్నారు. హైదరాబాద్ లో కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజల్లో చిచ్చు బిజేపీ , టిఆర్ఎస్ లు కలిసి చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు.గ్రేటర్ ఎన్నికలలో మా మేనిఫెస్టో నే మా హీరో..అని అన్నారు మాణిక్యం ఠాగూర్. ఇక టిఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుందంటున్న బీజేపీ నేతలు.. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం అవీనితీపై విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ఇంతకు ఐ.టి. ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయన్నారు. టిఆర్ఎస్, బీజేపీ లు ఢిల్లీలో దోస్తీ, గల్లీ లో కుస్తీ అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నారు.