బీజేపీ, ఎంఐఎం పార్టీ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీని అన్ని రాష్ట్రాల్లో గెలిపించడానికే అసదుద్దీన్ ప్రయత్నం చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు ఆరోపించిన సంగతిని ఈ సందర్బంగా ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ వైపల్యాలు, కాంగ్రెస్ హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి పనులపై షబ్బీర్ ఆలితో కలిసి కరపత్రాలు విడుదల చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బండి సంజయ్ కి హైదరాబాద్ ఎక్కడా మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా అని ఈ సందర్బంగా ఉత్తమ్ ప్రశ్శించారు. బీజేపీ ఓట్లకోసం ఎంఐఎం, ఎంఐఎం ఓట్లకోసం బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కష్టసుఖల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా ఉందని.. ఈ విషయాన్నిహైదరాబాద్ ప్రజలు గమనించాలని ఉత్తమ్ కోరారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లును కేసీఆర్ మద్దతు పలికారని గుర్తు చేసిన ఆయన.. రాజకీయ లబ్ది కోసం టీఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్-ఎంఐఎం అమిత్ షా కనుసన్నల్లోనే- షబ్బీర్ అలీ
హైదరాబాద్ అభివృద్దిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి అన్నారు.మెట్రోరైలు ఫౌండేషన్ కాంగ్రెస్ ప్రభత్వ హయాంలో వేశామని గుర్తు చేసిన ఆయన.. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్, కృష్ణ- గోదావరి నిళ్ల వంటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాలంనే నిరుపేదలకు 45 లక్షల ఇల్లు ఇచ్చామని చెప్పారు షబ్బీర్ ఆలి. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన టీఆర్ ఎస్.. ఎక్కడ కట్టారని ప్రశ్నించారు.సెక్రెటరియట్.. అందులో ఉన్న మసీద్ ను కూల్చారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఓట్లకోసం వస్తున్న కేంద్ర మంత్రులు.. వరదలప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అమిత్ షా కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.