కార్ లో కూడా అది కావాలంటున్న కియారా
తనకు రణ్వీర్ సింగ్ అంటే ప్రాణం అంటోంది అందాల భామ కియారా అడ్వాణి. అతనితో కలిసి నటించాలనేది తన డ్రీమ్ అట. రణ్వీర్ సింగ్ ను చూస్తే చాలు తనలో తెలియని ఉత్తేజం కలుగుతుందని చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ, రణ్వీర్ కాంబినేషన్లో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చింది. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నానని సిగ్గుపడుతూ చెప్పిందీ నెరజాన. ఇక బయటకు వెళ్లాలంటే అద్దంలో పదేపదే చూసుకునే అలవాటున్న కియారా… తన కార్లో కూడా ఓ అద్దం ఏర్పాటు చేసుకుంది.