ప్రజలకు ద్రోహం చేసిన టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు తగిన గుణపాఠం చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి వరద బాధిత కుటుంబానికి 50 వేల రూపాయలు, పూర్తిగా ద్వంసమైన ఇళ్లకు 5 లక్షల రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 2.5 లక్షలు ఇస్తామని చెప్పారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తామని, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ మరియు ఇతర ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
ఆరోగ్య కేంద్రాలు ఉచిత ల్యాబ్ పరీక్షలు చేయడానికి మరియు ఉచిత మందులను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మహిళలు, విద్యార్థులు, దివ్యంగులు, సీనియర్ సిటిజన్లకు మెట్రో, ఎంఎంటిఎస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత స్థానిక రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్ల భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ లో ప్రచారం నిర్వహించారు.