సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్ కు అనుమతి రాలేదు. భారత్ బయోటెక్ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై సమీక్షకు మోదీ ఈ రోజు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్లినపుడు విమానాశ్రయం వద్ద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకడం సంప్రదాం. ఈసారీ అలాగే చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఐతే ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఐదుగురికి మాత్రమే ప్రధాని కార్యాలయం అవకాశం ఇచ్చింది. వీరిలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సీపీ వీసీ సీజ్జనార్, హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ ఉన్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు ఆహ్వానానికి సీఎం రానవసరం లేదనే ఆదేశాలు గతంలో ఎన్నడూ రాలేదని, పీఎంవో అధికారులు ఇప్పుడు ఎందుకిలా చేశారో అర్థంకావటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ నేతలు ఆలోచనల్లో పడ్డారు.