News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రకాష్ రాజ్-నాగబాబుల మద్య వివాదం ముదురుతోంది

- Advertisement -

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌, మరో నటుడు-నిర్మాత నాగబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రకాష్‌ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, హీరో‌ పవన్‌ కల్యాణ్‌ను విమర్శించడంతో వివాదం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అని.. పార్టీ ఉండి కూడా పోటీ చేయకుండా, తానొక నాయకుడనే విషయం మరిచిపోయాడని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్‌ అయ్యాడు. ముందు నువ్వు మనిషిగా మారి అప్పుడు పవన్ గురించి మాట్లాడు అంటూ ప్రకాష్‌ రాజ్ పై మండిపడ్డాడు‌. దీంతో ఒక్కసారిగా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇస్తూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు… గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు..” అని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఈమోజీలను పోస్ట్ చేశారు. మరి దీనికి నాగబాబు ఎలా స్తందిస్తాడన్నదే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.