News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సోలోగా వస్తాడా.. బీజేపీతో జత కడతాడా

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయం రంగ ప్రవేశంపై ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. తలైవా తన అభిమాన సంఘాల నాయకులతో సోమవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రజనీకాంత్ పార్టీ ఏర్పాటుపై సుదీర్గంగా చర్చించారు. ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేస్తే ఎన్నికల సమయానికి ప్రజల్లోకి వెళ్లగలమా అన్న అనుమానాన్ని రజినీకాంత్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా అభిమాన సంఘాలతో రజినీ చర్చించారు. ఐతే పార్టీ ఏర్పాటుకే అభిమాన సంఘఆలు మొగ్గుచూపినట్లు సమాచారం. దీనిపై రజినీకాంత్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2021 కల్లా తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని వారంటున్నారు. మరి రజినీకాంత్ పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేస్తారన్నదే ఇప్పుడు తమిళ రాజకీయావర్గాలతో పాటు దేశవ్యాప్తంగా కొంత ఆసక్తినెలకొంది.

Leave A Reply

Your email address will not be published.