అవకాశాల కోసం అందాలు..
అందాల భామ శ్రద్ధాదాస్ హాట్ గా దర్శనమిచ్చింది. గతంలో చాలా తెలుగు సినిమాల్లో నటించిన శ్రద్ద ఈ మద్య కన్పించడం లేదనుకొండి. తెలుగులో అంత సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసి.. అక్కడ ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకు అనుగునంగానే శ్రధ్దకు బాలీవుడ్లో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం మంచి రోల్ అనుకుంటేనే గానీ సౌత్ వైపు చూడని శ్రద్దా.. బాలీవుడ్లో మాత్రం వీరలెవల్లో రెచ్చిపోతుంది. పాత్ర ఏదైనా సరే.. అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఎక్స్పోజింగ్ కు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సినిమాల్లోనే కాదు.. తన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పోస్ట్ చేస్తోందీ భామ. ఇంకేముంది ఈ ఫోటోల్లో శ్రధ్దను చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోవడం ఖాయం. తాజాగా తన ఇన్స్టాగ్రమ్లో శ్రద్ధా రెండు ఫొటోలను షేర్ చేసింది. మరిన్ని అవకాశాల కోసమే శ్రద్దా దాస్ హాట్ నెస్ ను ప్రదర్శిస్తోందని వేరే చెప్పక్కర్లేదనుకొండి.