జయలలిత నిచ్చెలి శశికళ వచ్చేస్తోంది
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటూ శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ విడుదల కాబోతోంది. సుప్రీంకోర్టు విధించిన 10 కోట్ల రూపాయల జరిమానాను శశికళ స్నేహితులు ప్రత్యేక కోర్టులో ఇటీవల డిపాజిట్ చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన అధికారిక పత్రాలు ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. 43 నెలల జైలుశిక్షను పూర్తి చేసుకున్న శశికళకు జరిమానా చెల్లించే పక్షంలో 135 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆమె అడ్వకేట్ తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తతే వచ్చే జనవరి 27న శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కావచ్చని జైలు అధికారులు చెబుతున్నారు.