గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. బీజేపీ ఏకంగా 49 డివిజన్లలో గెలుపొందింది. ఇక టీఆర్ ఎస్ పార్టీ 56 డివిజన్లకే పరిమితం అయ్యింది. ఎంఐఎం 43 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు డివిజన్లకే పరిమితం అయ్యింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ లో నువ్వా నేనా అన్న విధంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ కొనసాగింది. 2016లో కేవలం 4 స్థానాలను మాత్రమే గెలిచిన బీజేపీ.. ఈ సారి ఏకంగా 49 డివిజన్లలో గెలవడం కమలనాధుల భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఇక 2016లో 99 డివిజన్లను గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ ఈ సారి కేవలం 56 స్థానాలకే పరిమితం అయ్యింది. ఎంఐఎం పార్టీ 2016లో 44 స్థానాలను గెలుచుకోగా.. ఈ సారి 43 స్థానాల్లో తన సత్తా చాటుకుంది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు..
మొత్తం డివిజన్లు- 150
టీఆర్ఎస్- 56
బీజేపీ- 49
ఎంఐఎం- 43
కాంగ్రెస్- 2