హైదరాబాద్ ను ప్రదాని మోడి.. కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నారా…? దక్షిణాదిన బిజేపీ పట్టు పెంచుకునేందుకే మోడి ఈ స్కెచ్ వేశారా..? అంటే అవునంటున్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పార్లమెంట్ లో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓవైసీ. హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకే యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను.. యూటీలుగా మార్చే ప్రమాదం కూడా ఉందని.. బీజేపీ మద్దతిస్తున్న పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.ఓఐసీ వ్యాఖ్యలు రాష్ట్రంలో బిజేపీ ఎదుగుదలకు ఇబ్బందికరంగా మారనున్నాయి.