టిఆర్ఎస్ కోట్లు పంచినా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదు..
గ్రాడ్యూవేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోవడం… కాంగ్రేస్ గెలవడం ఖాయం అని అన్నారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ, వరంగల్, ఖమ్మం మరియు పాలమూర్, రంగారెడ్డి, హైదరాబద్ పట్టభద్రుల మండలి కాంగ్రెస్ అభ్యర్థులు, రాములు నాయక్ చిన్నారెడ్డి లు విజయాన్ని టిఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్నికలలో గెలిచేందుకు కోట్ల రూపాయలను టిఆర్ఎస్ వెదజల్లుతుందన్న ఉత్తమ్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు పంచినా.. ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు ఉత్తమ్. గాందిభవన్ లో నల్గొండ,ఖమ్మం వరంగల్ మరియు.. పాలమూర్, రంగారెడ్డి, హైదరాబద్ ఎమ్మెల్సీ ఎన్నికల పై జరిగిన సమావేశంలో .. పాల్గొన్న మండలపార్టీ అధ్యక్ష్యుల, ఎంపీటీసిలు.. జెడ్పీటీసీలు పార్టీ నాయకులకు ఉత్తమ్ దిశా నిర్దేశం చేశారు.సామాజిక న్యాయం ప్రాతిపదికననే నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీకి రాములు నాయక్ కు పార్టీ అవకాశం కల్పించిందని ..ప్రతి కార్యకర్త రాములు నాయక్ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కేసీఆర్ పీఆర్సీ పేరుతో ఉధ్యోగులను , యువతను నిండా ముంచేశారనిరన్న ఉత్తమ్..పాలమూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థిని నిలబెట్టలేని స్థితిలో అదికార పార్టీ ఉందన్న ఉత్తమ్.. అక్కడ చిన్నా రెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి.. కాంగ్రెస్ ను గెలిపించడం తెలంగాణ సమాజం భాధ్యత అని అన్నారు.
తెలంగాణకు హక్కుగా రావాల్సిన బయ్యారం స్టీల్ పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. గిరిజన యూనివర్సటీల విషయంలో బిజేపీ ఎందుకు మాట్లాడదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దీనిపై కేసీఆర్ మోడిని ఎందుకు నిలదీయడంలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.అయోధ్య రామ్ మందిర్ గురించి మాట్లాడుతారు కాని… భద్రాచలం రామమందిర్ గురించి మాత్రం ఇటు టిఆర్ఎస్ కాని.. అటు బీజేపీ గాని మాట్లడదు అని దయ్యప్టటారు ఉత్తమ్