News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దారు విజయారెడ్డి సజీవ దహనం

  • హైదరాబాదులో దారుణ ఘటన
  • విజయపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆగంతుకుడు
  • ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్న దుండగుడు

హైదరాబాదులో దారుణం సంభవించింది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు.. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెపై పెట్రోలు పోసి, నిప్పటించి సజీవదహనం చేశాడు. ఈ సందర్భంగా తనపై కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

మధ్యాహ్నం 1.20 గంటలకు తహశీల్దారు కార్యాలయంలోకి హంతకుడు చొరబడ్డాడు. అరగంట సేపు విజయ గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను సజీవదహనం చేశాడు. కాసేపటి క్రితం ఘటనా స్థలికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. మరోవైపు విజయ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.