News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీకి రజనీ స్ట్రోక్ ..!

చెన్నై : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనసరిగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన పట్ల చెలరేగిన దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కౌంటర్‌ ఇచ్చారు. బలవంతంగా హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎవరూ ఒప్పుకోరని కుండబద్దలు కొట్టాడు. ఇది మంచిపద్దతి కాదని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేయడం అసాధ్యమన్నారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంపైనా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని చెప్పారు. విభిన్న సంస్కృతులు, వేర్వేరు భాషలను మాట్లాడుతున్న భారత్‌ లో ఒకే భాషా సాధ్యపడదని అన్నారు.

Rajinikanth

కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేయాల్సి వస్తే .. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని చెప్పారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా హిందీని అమలు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఇదిలా ఉంటే .. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా వామపక్ష పార్టీల నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సైతం .. అమిత్‌ షా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తేల్చి చెప్పారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం, తమిళనాడుకు చెందిన డీఎంకే, మక్కళ్‌ నీథి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ దీనిపై స్పందించారు. తాజాగా ఇదే విషయంపై దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సైతం తన నోరు విప్పారు. బీజేపీ సానుభూతిపరునిగా గుర్తింపు ఉన్న రజినీకాంత్‌.. ఆ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారి.

- Advertisement -

Rajinikanth

Tags: AMITH SHA, RAJINIKANTH,TAMIL SUPER STAR,FILM ACTOR RAJINIKANTH,KAMAL HASAN,NARENDRA MODI, TAMILNADU POLITICS, AMITH SHA COMMENTS ON HINDI LANGUAGE, CONGRESS,BJP,DMK,AIDMK

Leave A Reply

Your email address will not be published.