News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అక్క సానియా మీర్జాను దాటి ఆనం క్రేజ్: నెట్టింట మొహందీ ఫోటోలు వైరల్

  • క్రికెటర్ అజురుద్దీన్ తనయుడితో నేడు వివాహం 
  • నిన్న ఆనం ఇంట మొహందీ వేడుక 
  • నెట్లో ఫొటోలకు ఇప్పటికే లక్ష దాటిన లైక్స్

టెన్నిస్ స్టార్ సానియామీర్జాను తలదన్నే క్రేజ్ ఆమె చెల్లెలు ఆనం మీర్జాకు కనిపిస్తోంది. అక్క పాపులారిటోనో, చేసుకోబోయే వాడు క్రికెట్ అజరుద్దీన్ కొడుకు కావడం వల్లనోగాని పెళ్లి ముందు జరిగే ఆమె మొహందీ ఫొటోలకు నెటిజన్లు తెగ లైక్ లు కొట్టేస్తున్నారు. అజరుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్, సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జాలు ప్రేమించుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

వీరి వివాహం ఈ రోజు, రిసెప్షన్ రేపు జరగనున్నాయి. వివాహంలో భాగంగా నిన్నరాత్రి ఆనం ఇంట గోరింటాకు పండగ (మొహందీ) జరిగింది. ఈ ఫంక్షన్లో నీలంరంగు లంగావోణీతో ఆనం మీర్జా అదరగొట్టింది. అలాగే సానియా మీర్జా చంటిబిడ్డతోను, ఆమె తల్లిదండ్రులు ఈ ఫంక్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫంక్షన్ ఫొటోలను సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ లో పెడితే ఇప్పటికే లైక్ కొట్టిన వారి సంఖ్య లక్ష దాటేయడం విశేషం.

Tags: anam mirza, mehndi function pics, instagram, sania mirza sister marriage

Leave A Reply

Your email address will not be published.