News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాంచరణ్ నాకెప్పుడూ చిట్టిబాబే: ట్విట్టర్లో రంగమ్మత

అప్పుడే పెళ్లెందుకు చేసుకున్నావ్..రాంచరణ్ నాకెప్పుడూ అంతే..నా భర్త ముద్దు పేరే నా టాటూ
ఓ వైపు వెండితెరపై.. మరో వైపు బుల్లి తెరపై నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అనసూయ. అనసూయకు కుర్రకారులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక అనసూయ ట్విటర్‌ వేదికగా అభిమానులతోచిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ చాలా ఓపిగ్గా  సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని అనసూయ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి.. అను.. అంత త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అంటూ దిగులుగా ఉన్న ఎమోజీలను ట్వీట్‌ చేశారు. అయ్యో.. నాకైతే దేవుడి దయ వల్ల అన్నీ సక్రమంగా సమయానికి జరిగాయి, జరుగుతున్నాయి అనిపిస్తుందండీ అంటూ అనసూయ నవ్వుతూ చిలిపిగా సమాధానం ఇచ్చింది.
ఇక అనసూయకు.. అభిమానులుకు మధ్య ట్విట్టర్ వేధికగా జరిగిన సంభాషణ…
అభిమాని- మీరు విజయవంతంగా రాణించాలని కోరుకుంటున్నా ‘రంగమ్మత్త’. రామ్‌చరణ్‌ గురించి చెప్పండి.అనసూయ- ధన్యవాదాలు. హ్యాపీ న్యూఇయర్‌. రామ్‌ ఎప్పటికీ నా ‘చిట్టిబాబే’.ఆయన నాకు స్ఫూర్తి.

అభిమాని– హాయ్‌ ‘రంగమ్మత్త’.. ఎలా ఉన్నారు?

అనసూయ– బాగున్నానండీ.. మీరు?

అభిమాని– ఇప్పటి వరకు మీరు ఎంత మందిని ట్విటర్‌లో బ్లాక్‌ చేశారు?

అనసూయ– ఏం ప్రశ్న అడిగారు. ప్రతి నెల దాదాపు 20 నుంచి 25 ఖాతాలను బ్లాక్‌ చేస్తుంటా.

అభిమాని– ఎలా ఉన్నారు?

అనసూయ– చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు.

అభిమాని– మీ కొత్త లక్ష్యం?

- Advertisement -

అనసూయ– ఫిట్‌గా తయారు కావాలి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తమంగా ఉండాలి.

అభిమాని– గ్లామర్‌ పాత్రలా?, మంచి పాత్రలా?అనసూయ– వీటిలో ఒక్కటే ఎంచుకోమంటే.. మంచి పాత్రలకే నా ఓటు. కానీ ఈ రెండూ ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నా.

అభిమాని– ఐ లవ్‌ యూ అనసూయ.అనసూయ- సిగ్గుపడుతున్న ఎమోజీలు.

అభిమాని– మీకు స్ఫూర్తి ఎవరు? టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు, నటి ఎవరు?

అనసూయ– సమాజంలోని జనాలు ఓ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే విధానం చూసి నేను స్ఫూర్తి పొందుతుంటాను. అలా చాలా సంఘటనలు జరిగాయి.

అభిమాని–  మిమ్మల్ని మీరు స్క్రీన్‌పై చూసుకుని ఆశ్చర్యపోతుంటారా?

అనసూయ– ఆశ్చర్యపోవడానికి ఏం ఉంది. నా పని పట్ల నేను గర్వంగా ఉన్నాను.

అభిమాని–  మీ టాటూకి అర్థం ఏంటి?అనసూయ- దాని అర్థం ‘నిక్కు’.. నా భర్త ముద్దు పేరు.

అభిమాని– ఓటమి అనే భయాన్ని ఎలా అధిగమిస్తారు?అనసూయ– నాపై నేను నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్తా.

అభిమాని– ఎప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?అనసూయ– స్వీట్‌ హోమ్‌లో..

అభిమాని– హైపర్‌ ఆది గురించి ఒక్క మాటలో చెప్పండి?

అనసూయ– నాకు ఇష్టమైన నటుడు.

అభిమాని– మీ తొలి జీతం.

- Advertisement -

అనసూయ– నా తొలి జీతం రూ.5,500.

అభిమాని– మీరు అందంగా ఉంటారు?
అనసూయ– అది చూసే కళ్లపై ఆధారపడి ఉంటుంది.

భిమాని–  మీకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయా?

అనసూయ– బాగా పాడతాను, చక్కగా వంట చేయగలను అనుకుంటున్నా.

అభిమాని– మీరు ఎప్పుడు టీవీ ఛానల్, నిర్మాణ సంస్థను‌ ప్రారంభిస్తారు?అనసూయ- ఇది ఎక్కడి నుంచి వచ్చింది.

అభిమాని– మీకు ఇష్టమైన సినిమా?, పాట?అనసూయ– ఎలాంటి ప్రశ్న అడిగారు. ప్రస్తుతం నేను ‘గర్ల్‌ లైక్‌ యు’ పాట వింటున్నా.. ఈ మధ్య నాకు నచ్చిన సినిమా ‘ఆక్వామ్యాన్‌’.

అభిమాని– మీ అమ్మాయి పేరు? ఇంకా తన గురించి చెప్పండి?

అనసూయ– కుమార్తె ఉంటే బాగుండేది. నాకు ఇద్దరూ అబ్బాయిలే.

అభిమాని– ఏం తింటున్నావు బంగారం.. ఇంత అందంగా పుట్టేశావ్‌.అనసూయ- నవ్వుతూ సిగ్గుపడుతున్న ఎమోజీలు.

అభిమాని– గత ఏడాది మీ బెస్ట్‌ మూమెంట్‌ ఏంటి?అనసూయ– అనుమానమే లేదు.. మీరంతా ‘రంగమ్మత్త’కు ఇచ్చిన ప్రశంసలే.

అభిమాని– విమర్శల్ని ఎలా తీసుకుంటారు?అనసూయ– అది విమర్శించే వారిపై ఆధారపడి ఉంటుంది.

అభిమాని– ‘యాత్ర’లో మమ్ముట్టి సర్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

అనసూయ– అదృష్టంగా భావిస్తున్నా. ఆయన లెజెండ్‌.

అభిమాని– మీకు క్రీడలంటే ఆసక్తి ఉందా?

అనసూయ– నాకు ఈత కొట్టడం అంటే ఇష్టం. షటిల్‌ ఆడటాన్ని ఎంజాయ్‌ చేస్తా.

అభిమాని– అను.. 18 నిమిషాలుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నా.. రిప్లై ఇవ్వు.

అనసూయ– అయ్యో.. మీ ట్వీట్లు నిజంగా కనిపించలేదండీ.

అభిమాని– అనసూయ మీరు పొట్టి జుట్టులో కంటే పొడవు జుట్టులో బాగుంటారు.

అనసూయ– ధన్యవాదాలు. దీన్ని గుర్తు పెట్టుకుంటా.

అభిమాని– ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి చెప్పండి?అనసూయ– మీకు ఎంత తెలుసో.. నాకూ అంతే తెలుసు.

ఇలా అందాల భామ అనసూయ ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి చాలా ఓపికగా తనదైన స్టైల్లో సమాధానాలిచ్చిందన్నమాట.

Leave A Reply

Your email address will not be published.